కాలిఫోర్నియాలోని బొడేగా బే వద్ద ఒక కారు అదుపు తప్పి వంద అడుగుల లోయలో పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ మాచారం అందుకున్న సహాయక బృందాలు ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నాయి. ఈ స్థలం ఒక పర్యాటక ప్రదేశం కావడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు.