ఏపీలో 30,678 నమూనాలను పరీక్షించగా 1,326 పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 9,09,002కి చేరింది. చికిత్స పొందుతూ ఐదుగురు మృతిచెందడంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 7,244కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,52,39,114 నమూనాలను పరీక్షించగా ఇప్పటికి 10,710 యాక్టివ్ కేసులుంటే 911 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.
