భారత్‌లో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,03,558 మందికి పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం మొత్తం కేసులు 1,25,89,067కి చేరాయి. మొత్తం క్రియాశీలక కేసుల సంఖ్య 7,41,830కి పెరగడంతో క్రియాశీల రేటు 5.89కి చేరింది. గడిచిన 24 గంటల్లో 52,847 మంది కొవిడ్ నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీలు 1,16,82,136కి చేరగా..ఆ రేటు 92.80 శాతానికి పడిపోయింది. 478 మంది మృత్యుఒడికి చేరడంతో ఇప్పటి వరకు మొత్తం 1,65,101 మంది కోవిడ్ కు బలయ్యారు.