రాజకీయం (Politics) వార్తలు (News)

మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా

ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ గతంలో అనిల్ దేశ్‌ముఖ్‌పై చేసిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలంటూ జయ్‌శ్రీ పాటిల్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేయడంతో విచారణ జరిపిన కోర్టు, అవినీతి ఆరోపణలపై 15రోజుల్లో ప్రాథమిక విచారణ జరిపించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల తర్వాత అనిల్ దేశ్‌ముఖ్ పార్టీ నాయకులను కలిసి ఇలాంటి సమయంలో పదవిలో ఉండటం తనకు ఇష్టం లేదని వారికి చెప్పారని రాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నాయకుడు నవాజ్ మాలిక్ చెప్పారు. దాని తర్వాత రాజీనామా లేఖను ఆయన ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు సమర్పించారని, అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామాను ఆమోదించాలని పార్టీ తరఫున ముఖ్యమంత్రిని కోరినట్లు నవాజ్ మాలిక్ చెప్పారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.