రైతులు పంటలు పండించే క్రమంలో ఎంత కష్టపడినా కూడా ప్రకృతి సహకరించాలన్న విషయం అందరికి తెలిసిందే! అయితే ఒక రైతు వినూత్నంగా ఆలోచించి తన పని పూర్తి చేసుకున్నారు. నిజానికి గాలి వీచని సందర్భాల్లో రైతులు ధాన్యం తూర్పారా పట్టేందుకు ట్రాక్టర్‌ పంకాలను ఏర్పాటు చేసుకుంటారు. దీనికోసం ఇంధన వ్యయంతో పాటు కూలి ఖర్చులు భరించాలి అయితే దీనిని నివారించేందుకు ఎర్రగుంట రైతు ఆరపల్లి సత్యనారాయణ ఓ ఆలోచన చేశారు. అదేంటంటే ఇంట్లో వాడే టర్బో కూలర్‌ సాయంతోనే ఆవరణలో జొన్నలు తూర్పారా పట్టి మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలిచారు.