జాతీయం (National) వార్తలు (News)

సెంటిమెంట్ భయాలతో నష్టాల్లో మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్ని చవిచూశాయి. ఉదయం నష్టాల్లో మొదలైన సూచీలు అంతకంతకు దిగజారి భారీ నష్టాల్ని మూటకట్టుకున్నాయి. ఉదయం సెన్సెక్స్‌ 50,020 వద్ద మొదలై 1,449 పాయింట్లు కుంగి 48,580 వద్ద కనిష్టాన్ని తాకాయి. ఇక నిఫ్టీ 14,837 వద్ద ప్రతికూలంగా ట్రేడింగ్‌ మొదలు పెట్టి ఒక దశలో 408 పాయింట్లు కోల్పోయి 14,459 వద్ద కనిష్ఠాన్ని తాకాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కనిష్ఠాల నుంచి సూచీలు కోలుకున్నట్టు కనిపించినప్పటికీ లాభాల్లోకి మాత్రం రాలేకపోయాయి.

బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్లు మూడు శాతానికి పైగా నష్టపోయాయి. విప్రో, టీసీఎస్, హెచ్‌సీఎల్‌ టెక్‌, బ్రిటానియా, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల్లో ఉండగా బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐషర్‌ మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు నష్టాలు చవిచూసాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.