అంతర్జాతీయం (International) వార్తలు (News)

ఇండోనేసియా వరదల్లో 50 మందికి పైగా మృతి

ఇండోనేసియా, తూర్పు తైమూర్ దేశాల్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం కొండచరియలు విరిగిపడటం వల్ల యాభైకిపైగా మంది చనిపోయారు. వరద విపరీతంగా వచ్చి చేరడంతో డ్యాముల నుంచి నీరు ఉప్పొంగి ప్రవహిస్తూ వేల సంఖ్యలో ఇళ్లు వరద ముంపుకు గురయ్యాయి. ఇండోనేసియా తూర్పు ప్రాంతంలోని ఫ్లోర్స్ ద్వీపం నుంచి పొరుగున ఉన్న దేశమైన తూర్పు తైమూర్ వరకూ ఈ వరదలు ప్రభావం చూపించడంతో గల్లంతైనవారి కోసం రక్షక సిబ్బంది గాలింపు కొనసాగిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇండోనేసియన్ డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ అధికార ప్రతినిధి రాదిత్య జాటి ‘నాలుగు ఉప జిల్లాలు, ఏడు గ్రామాలపై ఈ వరదలు ప్రభావం చూపించాయి. క్షేత్ర స్థాయిలో ఉన్న మా బృందంతో మాట్లాడి సమాచారాన్ని ధ్రువీకరించుకున్నాం. ఇప్పటివరకూ 41 మంది మరణించినట్లు గుర్తించాం. మరో 27 మంది గల్లంతయ్యారు. తొమ్మిది మంది గాయపడ్డారు’’ తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.