ఛత్తీస్‌గఢ్ అడవుల్లో గత శనివారం మావోయిస్టులు – పోలీసు బలగాల మధ్య జరిగిన హోరాహోరీ కాల్పుల్లో 22 మంది భద్రతాసిబ్బంది అమరులైన విషయం తెలిసిందే. ఆ
భీకర కాల్పుల తర్వాత కోబ్రా యూనిట్‌కు చెందిన ఒక కమాండో కన్పించకుండా పోయారు. అయితే ఆ కమాండో తమవద్దే ఉన్నాడంటూ నక్సల్స్ పేరుతో ఫోన్ కాల్స్ వచ్చాయి. దీంతో ఆ ఫోన్ కాల్స్‌పై భద్రతాసిబ్బంది దర్యాప్తు చేపట్టారు. అయితే కమాండోను నక్సల్స్ తీసుకెళ్లారని చెప్పేందుకు స్పష్టమైన ఆధారాలేమీ లేవని, ఆ జవాను కోసం భద్రతా సిబ్బంది గాలిస్తున్నట్లు, ఓ కీలక మావోయిస్టు దళంనుంచి ఆ కాల్ వచ్చిందని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.