వార్తలు (News)

కేటీఆర్‌ చేతుల మీదుగా రైల్వే అండర్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌ మహా నగరాన్ని సిగ్నల్‌ ఫ్రీ రహదారుల నగరంగా మార్చేందుకు రూ.66.59కోట్ల వ్యయంతో పూర్తయిన హైటెక్‌ సిటీ రైల్వే అండర్‌ బ్రిడ్జి (ఆర్‌యూబీ)ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. తీవ్రమైన ట్రాఫిక్‌ రద్దీ ఉండే మార్గంలో దాదాపు 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఆర్‌యూబీ ప్రారంభంతో వాహనదారులకు ఊరట లభించనుంది. గతంలో ఈ వంతెన కింద నిత్యం 35 నుంచి 40వేల లీటర్ల వరకు నీరు ఊరుతుంది ఇప్పుడు ఆర్‌యూబీ సమీపంలో ఓ సంపును నిర్మించి అందులో నీటిని నిల్వచేయడం ద్వారా మూసాపేట సర్కిళ్లో హరితహారం మొక్కలకు నీరందించనున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.