వార్తలు (News)

పాత కరెంటు వైరే కదా అని అజాగ్రత్తగా ఉంటే ??

కడప అక్కాయపల్లెలో ఫరీదా, సయ్యద్‌ ఆరిపుల్లా దంపతులు జీవిస్తున్నారు. సయ్యద్‌ ఆరిపుల్లా జీవనోపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాడు.వారికి ముగ్గురు పిల్లలున్నారు. అక్కాయపల్లెలో ఫరీదా, ఆమె పిల్లలు రెండో అంతస్తులో కాపురముంటున్నారు. వీళ్లు ప్రతి రోజు ఇంట్లో పోగైన చెత్తను ప్లాస్టిక్‌ బకెట్‌లో వేసి తాడు సాయంతో కిందకు దించేవారు. అదే క్రమంలో ఆదివారం రాత్రి వీరి పెద్ద కుమార్తె అయిషా(13) బకెట్‌కు తాడు బదులు పక్కనే అక్కడక్కడ అతుకులున్న పాత విద్యుత్తు తీగకు బకెట్ కట్టి కిందకు దింపుతున్న సమయంలో విద్యుత్తు తీగకు 11 కేవీ విద్యుత్తు తీగల నుంచి విద్యుత్తు సరఫరా కావడంతో పాటు అక్కడే ఉన్న స్టీల్‌ స్తంభానికి కూడా విద్యుత్తు సరఫరా అయింది. ఒక్కసారిగా అధిక విద్యుత్తు ప్రసారం కావడంతో అయిషా చెయ్యి తెగి కిందపడింది. తన కుమార్తెను కాపాడేందుకు యత్నించి ఫరీదా కూడా తీవ్రంగా గాయపడ్డారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.