అంతర్జాతీయం (International) వార్తలు (News)

పిడుగుపాటు కారణంగా పెళ్లి వేడుకలోని 17 మంది మృతి!!

బంగ్లాదేశ్‌లో పిడుగుపాటు కారణంగా పెళ్లి వేడుకలోని 17 మంది మృతి చెందినట్లు, వరుడితో పాటు మరో 14 మంది గాయాల పాలైనట్టు అధికారులు వెల్లడించారు. ఘటన జరిగిన సమయంలో వధువు ఆ వేడుకలో లేకపోవడంతో ఆమెకు ప్రమాదం తప్పింది.

నది ఒడ్డున ఉన్న షిబ్‌గంజ్ నగరం నుంచి వివాహ వేడుక కోసం వరుని తరపు వారు పడవలో వధువు ఇంటికి వెళ్తుండగా వారు పిడుగుపాటుకు గురయ్యారు. పెళ్లి బృందాన్ని మెరుపులు అనేకసార్లు తాకినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అడవులు అదృశ్యం కావడం వల్లనే పిడుగుపాటు ప్రమాదాలు పెరుగుతున్నాయని, పిడుగులను ఆకర్షించే పొడవైన చెట్లు లేకపోవడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •