టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

నేడు ఏపి లో మరో మెగా జాబ్ మేళా!!

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి నిర్వహిస్తున్న జాబ్ మేళాకు ఈ నెల (ఆగష్టు) 5 వ తేదీన ఉదయం 10 గంటలకు శ్రీ రాజ గవర్నమెంట్ హై స్కూల్, మెయిన్ రోడ్, తుని – తూర్పు గోదావరి జిల్లా చిరునామాలో ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు.

1 .Hero Moto Corps: ఈ సంస్థ టెక్నీషియన్ విభాగంలో 70 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ITI చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.. ఎంపికైన వారికి నెలకు రూ. 14,475 వేతనం చెల్లించనున్నారు.
2.Innov Source Pvt Ltd: ఈ సంస్థలో 100 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులెవరైనా ఈ ఉద్యోగాలకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 13 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
3.Raising Star Mobiles India Pvt Ltd(LED Tv’S): ఈ సంస్థలో ప్రొడక్షన్ మేనేజర్ విబాగంలో 60 ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హతల కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 11500 వరకు వేతనం చెల్లించనున్నారు.
4.Amar Raja Batteries Ltd: ఈ సంస్థలో 180 ఖాళీలను మెషిన్ ఆపరేటర్ విభాగంలో భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 10600 వేతనం చెల్లించనున్నారు.
5.Appollo Pharmacy: ఈ సంస్థలో ఫార్మసిస్ట్ విభాగంలో 20 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. D/B/M ఫార్మసీ PCI సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల నుంచి రూ.15 వేల వరకు అందించనున్నారు.
6.Flipkart: ఈ సంస్థలో 80 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్/ఇంటర్/డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులు.
7.Good Worker(Zomato): ఈ సంస్థలోనూ 50 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల వరకు చెల్లించనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు.
8.Airtel Payments: ఈ సంస్థలో 30 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. MBA చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు చెల్లించనున్నారు.
9.MedPlus: ఈ సంస్థలో 45 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఫార్మసిస్ట్/ఫార్మా ట్రైనీ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్/డిగ్రీ&B/M ఫార్మసీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేయొచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 8 వేల నుంచి రూ. 12 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
10.SBI Life Insurance: లైఫ్ మిత్రా/సేల్స్ మేనేజర్&యూనిట్ మేనేజర్ విభాగంలో 30 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్ నుంచి డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.

ఇతర వివరాలు: అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు http://www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9949500473 నంబర్ ను సంప్రదించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    2
    Shares
  • 2
  •  
  •  
  •  
  •