రాజకీయం (Politics) వార్తలు (News)

సీఎం కేసీఆర్ కు పిండప్రదానం??

కరీంనగర్ లో మెడికల్ కాలేజీ ఏర్పాటుచేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా జమ్మికుంటలో కాంగ్రెస్ శ్రేణులు విచిత్రంగా నిరసన చేపట్టారు.

కరీంనగర్ జిల్లాకేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చి ఏడేళ్లు అయిందని ఇప్పటివరకు ఆ దిశగా ఒక్కటంటే ఒక్క చర్య తీసుకోలేదని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తూ ఇందుకు నిరసనగా జమ్మికుంట పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు పిండ ప్రదానం చేశారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ శ్రేణులు రోడ్డుపై బైటాయించడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా ఇరువురి మధ్య తోపులాట జరిగింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •