రాజకీయం (Politics) వార్తలు (News)

దేవినేని ఉమకు బెయిల్!!

తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ రాజమహేంద్రవరం జైలు లో శిక్ష అనుభవిస్తున్న సంగతి పాఠకులకు విదితమే! ఇప్పుడు తాజాగా ఉమ రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలయ్యారు. కృష్ణా జిల్లా కొండపల్లిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో జి.కొండూరు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. తనను అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ దేవినేని ఉమ హైకోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలు చేయగా ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది ఆయన విడుదల సందర్భంగా జైలు వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఉమ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కుట్రలు చేసినా న్యాయదేవత అనుగ్రహంతో విడుదలయ్యానని చెప్పారు. అక్రమ నిర్బంధాలతో తమ పోరాటం ఆగదన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •