అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

41 ఏళ్ల కల నిజమైన వేళ..చెక్‌దే ఇండియా!!

టోక్యో నడిబొడ్డున త్రివర్ణ పతాకం రెపరెపలాడడంతో ప్రతి ఒక్క భారతీయ గుండె పులకించిపోయింది. 130+కోట్ల భారతీయుల హృదయాలు మురిసిపోయాయి. చెక్‌దే ఇండియా నినాదాలు మార్మోగిపోయాయి. సరికొత్త చరిత్ర ఆవిష్కృతమవ్వడంతో హాకీ ఇండియాకు పునర్వైభవం రానుంది. 4 దశాబ్దాల తర్వాత స్వర్ణోదయానికి అడుగులు పడ్డాయి. ఎన్నాళ్లో కన్న కలలు నిజమైన వేళ ఇది. ఇది ఒలింపిక్స్‌లో పతకాల కరవు తీరుస్తూ ‘మన్‌’ప్రీత్‌ సేన ఆవిష్కరించిన మహాద్భుతం. ఒలింపిక్స్‌ పసడి పతక పోరులోనైనా ఇంత ఉత్కంఠ ఉండదనుకుంటా.. క్రికెట్లో ఆఖరి బంతికి సిక్సర్‌ కొట్టి గెలిస్తే ఎంత ఖుషీ అవుతామో అంతకు మించి ఉత్కంఠభరితమైన విజయం అందించింది మన్‌ప్రీత్‌ సేన.

ఆఖరి క్వార్టర్లో నిమిషాలు గడిచే కొద్దీ, సెకన్లు ముగిసే కొద్దీ, కంటిరెప్పలు సైతం వాల్చలేనంతటి నర్వస్‌నెస్‌.. చివరి ఆరు సెకన్లలో ప్రత్యర్థికి పెనాల్టీ కార్నర్‌.. ఆ అవకాశం చేజార్చుకుంటే ఆశలన్నీ చెదిరిపోతాయి. 41 ఏళ్ల కల కలగానే ఉండిపోతుంది. అందుకే ఇది పసిడి పోరును మించిన పోరాటం.

పసిడి పతకాన్ని తలదన్నేలా జరిగిన పోరులో హాకీ ఇండియా దుమ్మురేపింది. నరాలు మెలిపెట్టే ఉత్కంఠను అధిగమించి పునర్వైభవమే లక్ష్యంగా ఆడిన పోరులో అద్భుత విజయం సాధించింది. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించింది.

జర్మనీతో జరిగిన కాంస్య పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. బలమైన ప్రత్యర్థిని 5-4 తేడాతో ఓడించి నవ చరిత్రకు నాంది పలికింది. టీమ్‌ఇండియా నుంచి సిమ్రన్‌ జీత్‌ సింగ్‌ (17, 34 ని), హార్దిక్‌ సింగ్‌ (27ని), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (29ని), రూపిందర్‌ పాల్‌ సింగ్‌ (31ని) గోల్స్‌ చేశారు. జర్మనీలో టిముర్‌ ఒరుజ్‌ (2ని), నిక్లాస్‌ వెలెన్‌ (24ని), బెనెడిక్ట్‌ ఫర్క్‌ (25ని), లుకాస్‌ విండ్‌ఫెదెర్‌ (48ని) రాణించారు. పసిడి పతకాన్ని తలదన్నేలా జరిగిన పోరులో హాకీ ఇండియా దుమ్మురేపింది. నరాలు మెలిపెట్టే ఉత్కంఠను అధిగమించింది.

టీమ్‌ఇండియా నుంచి సిమ్రన్‌ జీత్‌ సింగ్‌ (17, 34 ని), హార్దిక్‌ సింగ్‌ (27ని), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (29ని), రూపిందర్‌ పాల్‌ సింగ్‌ (31ని) గోల్స్‌ చేశారు. జర్మనీలో టిముర్‌ ఒరుజ్‌ (2ని), నిక్లాస్‌ వెలెన్‌ (24ని), బెనెడిక్ట్‌ ఫర్క్‌ (25ని), లుకాస్‌ విండ్‌ఫెదెర్‌ (48ని) రాణించారు. ప్రత్యర్థి జర్మనీ రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత. టీమ్‌ఇండియాకు 41 ఏళ్లుగా పతక పోరులో తలపడ్డ అనుభవంలేదు కానీ గెలవాలన్న తపన, కసి మాత్రం ఉన్నాయి. అంతకుమించి స్వర్ణం చేజార్చుకున్నామన్న ఆవేదనా ఉంది. అందుకే ఈ మ్యాచులో ప్రతి క్వార్టర్‌ రసవత్తరంగా సాగింది. ఆట ఆరంభమైన రెండో నిమిషంలోనే ఒరుజ్‌ ఫీల్డ్‌ గోల్‌ కొట్టి జర్మనీని 1-0తో ఆధిక్యంలోకి తీసుకెళ్లి భారత్‌పై ఒత్తిడి పెట్టాడు. దాంతో తొలి క్వార్టర్‌ను టీమ్‌ఇండియా 0-1తో ముగించింది.

రెండో క్వార్టర్లో పోరు నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. రెండు జట్లు బంతిని తమ అధీనంలో ఉంచుకొనేందుకు ప్రయత్నించాయి. ఇదే సమయంలో టీమ్‌ఇండియా దూకుడు పెంచి ఈ క్వార్టర్లో ఏకంగా మూడు గోల్స్‌ సాధించింది. 17వ నిమిషంలో అద్భుతమైన రివర్స్‌ హిట్‌తో జర్మనీ డిఫెన్స్‌ను ఛేదిస్తూ సిమ్రన్‌జీత్‌ ఫీల్డ్‌ గోల్‌ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా చిన్నచిన్న పొరపాట్లు చేసి జర్మనీకి అవకాశాలు ఇవ్వడంతో రెండు నిమిషాల వ్యవధిలో వెలెన్‌, బెనడిక్ట్‌ గోల్స్‌ చేసి స్కోరును 3-1కి పెంచారు. నిరాశ పడకుండా పుంజుకున్న భారత్‌ మూడు నిమిషాల్లో రెండు గోల్స్‌ చేసింది. 27వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను హార్దిక్‌ సద్వినియోగం చేశాడు. హర్మన్‌ప్రీత్‌ చక్కని ఫ్లిక్‌తో స్కోరును 3-3తో సమం చేశాడు.

మూడో క్వార్టర్‌ను ఆత్మవిశ్వాసంతో ఆరంభించిన టీమ్‌ఇండియా దూకుడుగా ఆడుతూ అవకాశాలను ఒడిసిపట్టి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేసింది. జర్మనీ గోల్‌పోస్టు వద్ద పదేపదే దాడులు కొనసాగించింది. సిమ్రన్‌జీత్‌ రెండో గోల్‌ కొట్టాడు. అంతకు ముందే పెనాల్టీ స్ట్రోక్‌ను రూపిందర్‌ గోల్‌గా మలవడంతో భారత్‌ 5-3తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. 41వ నిమిషంలో మూడు పీసీలు వచ్చినా భారత్‌ ఒడిసిపట్టలేదు. మరో మూడు నిమిషాలకే జర్మనీకీ మూడు పీసీలు వచ్చాయి. గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌, సహచరులతో కలిసి వాటిని అడ్డుకొన్నాడు. మరో 3 నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా శ్రీజేశ్‌ కాళ్ల మధ్య నుంచి విండ్‌ఫెదర్‌ గోల్‌ కొట్టి టెన్షన్‌ పెట్టాడు.

ఆట మరో 6 సెకన్లలో ముగుస్తుందనగా ప్రత్యర్థికి పీసీ రావడంతో ఒక్కసారిగా షాక్‌! ఈ ఆరు సెకన్లు ప్రత్యర్థిని విజయవంతంగా అడ్డుకోవాలని ఎంతో మంది ప్రార్థించారు. అందుకు తగ్గట్టే అద్భుతం జరిగింది. ఆ పీసీని భారత్‌ విఫలం చేసి చరిత్ర సృష్టించింది. నాలుగో క్వార్టర్లో రెండు జట్లు ఒత్తిడికి లోనయ్యాయి. గెలవాలని టీమ్‌ఇండియా.. స్కోరు సమం చేయాలని జర్మనీ.. అత్యుత్తమంగా ఆడాయి. జర్మనీ విజయం కోసం ఎంత పోరాడిందంటే ఏకంగా 28 సార్లు భారత గోల్‌పోస్ట్‌ వృత్తం వద్ద దాడులు చేసింది. అదే భారత్‌కు 15 సార్లే ఇలాంటి అవకాశాలు లభించింది. 13 పీసీల్లో జర్మనీ ఒకటే గోల్‌గా మలిచింది. 11 అవకాశాల్లో మూడు ఫీల్డ్‌ గోల్స్‌ చేసింది. టీమ్‌ఇండియా 6 పీసీల్లో 2 సద్వినియోగం చేసింది. 4 అవకాశాల్లో 2 ఫీల్డ్‌ గోల్స్‌ కొట్టింది. 13 పీసీల్లో జర్మనీ ఒకటే గోల్‌గా మలిచింది. 11 అవకాశాల్లో మూడు ఫీల్డ్‌ గోల్స్‌ చేసింది. టీమ్‌ఇండియా 6 పీసీల్లో 2 సద్వినియోగం చేసింది. 4 అవకాశాల్లో 2 ఫీల్డ్‌ గోల్స్‌ కొట్టింది. ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలిచింది. ఇక గోల్‌ కీపర్‌ శ్రీజేశ్‌ ఐదు పీసీల్లో 4 అడ్డుకొని భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •