క్రైమ్ (Crime) జాతీయం (National) వార్తలు (News)

పాత నోట్ల ప్రకటనలతో ఎలాంటి సంబంధం లేదు: ఆర్బీఐ

పాత కరెన్సీ నోట్లు, నాణేలు కమీషనుతో విక్రయిస్తామని కానీ, కొంటామని కానీ అనధికారికంగా చేసే మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దంటూ రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బుధవారం ఓ ప్రకటనలో ప్రజలను హెచ్చరించింది. కొంతమంది వ్యక్తులు/ సంస్థలు రిజర్వుబ్యాంక్‌ పేరు, లోగోలను సైతం వాడుకొని ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నట్టు తమదృష్టికి వచ్చిందని, ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ మార్గాల ద్వారా పాత నోట్ల చలామణీ చేస్తూ ప్రజల నుంచి ఛార్జీలు, కమీషన్లు, పన్నులు వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్‌బీఐకి ఇటువంటి వ్యవహారాలతో సంబంధం లేదని, ఇలాంటి చలామణీలకు తమ ప్రతినిధులుగా ఎవరినీ నియమించలేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •