ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

తెలంగాణలో పలుచోట్ల లాక్ డౌన్!!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో స్వచ్ఛందంగా గ్రామాల ప్రజలు సెల్ఫ్ లాక్ డౌన్ పాటిస్తూ వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇప్పటికే వెల్గటూర్ మండలం ఎండపల్లి, మద్దుట్లలో కరోనా కేసులు పెరగడంతో లాక్ డౌన్ విధించగా ఆగస్టు ఫస్ట్ తో లాక్ డౌన్ ని ఎత్తివేశారు.

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెలుగుమట్లలో సోమవారం కరోనాతో ఒకరు చనిపోవడంతో స్వచ్ఛంద లాక్ డౌన్ విధించారు. గ్రామంలో ఇప్పటి వరకు 35 కరోనా కేసుల నమోదయ్యాయి. మంగళవారం నుంచి పదిహేను రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. ఆ నిబంధనలు పాటించని పక్షంలో రూ.1000 ఫైన్ విధిస్తామని గ్రామపంచాయతీ పాలక వర్గం వెల్లడించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •