అంతర్జాతీయం (International) వార్తలు (News)

పాక్ ప్రధాని ఇల్లు అద్దెకు!!

పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ ఎంతగా దిగజారిందో చెప్పవలసిన అవసరమే లేదు.పక్కనున్న గల్ఫ్ దేశాలు ఆయిల్, పర్యాటక రంగం లో దృష్టి పెట్టి సంపాదన పెంచుకుంటుంటే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులకు అండగా ఉంటూ, చైనాకు వత్తాసు పలుకుతూ, ఇండియా మీద కాలు దువ్వుతూ పరిస్థితిని దిగజార్చుకుంటోంది. ఇప్పటికే ఆ దేశం పీకలలోతు అప్పుల్లో కూరుకుపోయింది.

ఇస్లామాబాద్‌లోని విశాలమైన స్థలంలో ఉన్న అధునాతన భవనం లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అధికారిక నివాసం ఉన్నది. కానీ ఆయన దాన్ని ఖాళీచేశారు. మొదట ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేద్దామని అనుకున్నప్పటికీ అది కుదరకపోవడంతో ఈ భవనాన్ని అద్దెకు ఇవ్వాలని ఇమ్రాన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ఈవెంట్లు, సెమినార్లకు ఈ భవనాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారు. ఫలితంగా కోట్ల రూపాయలు సంపాదన వస్తుందని అది ప్రభుత్వ నిర్వాహణకు కొంత ఉపయోగకరంగా ఉంటుందని ఆశ పడుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •