రాజకీయం (Politics)

అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు 24న చెల్లింపులు!!

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని,రూ.10వేల వరకు ఉన్న డిపాజిట్లను బాధితులకు అందజేసినట్టు, ప్రస్తుతం రూ.10వేల నుంచి రూ.20వేల లోపు ఉన్న అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌ దారులకు వారి బ్యాంకుఖాతాలో ఈనెల 24న సీఎం చేతులమీదుగా జమ చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

అర్హులైన అగ్రిగోల్డ్‌ ఖాతాదారులు డిపాజిట్లకు సంబంధించిన ఒరిజినల్‌ పత్రాలు, చెక్కు, పే ఆర్డర్‌, రశీదులు, బ్యాంకు పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డులను సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాల్లో సమర్పించాలని తెలిపారు. ఎవరైనా డిపాజిట్‌ దారుడు మరణిస్తే లీగల్‌ హెయిర్‌ సర్టిఫికెట్‌ చూపాలని, నగదును వారి చట్టబద్ధ సంబంధికుల బ్యాంకు ఖాతాలో జమచేస్తామని ప్రభుత్వం తెలిపింది.

ఒక డిపాజిట్‌ దారుడు ఒక క్లెయిమ్‌కు మాత్రమే అర్హులని, గతంలో రూ.10వేల లోపు డిపాజిట్‌ క్లెయిమ్‌ పొందిన వారు ప్రస్తుతం అనర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. బాధితుల సమస్యల పరిష్కారానికి 1800 4253 875 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •