జాతీయం (National) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

రెండు రోజులపాటు SBI ఆన్‌లైన్ సేవలు బంద్!!

దేశంలోని అతి పెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI) తమ బ్యాంకుకు చెందిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో మొబైల్ అప్లికేషన్‌కు సంబంధించిన ఆన్‌లైన్ సేవలకు రెండు రోజుల పాటు కాస్త అంతరాయం కలుగుతుందని ప్రకటించింది. ఆగష్టు 6న రాత్రి 10:45 నిమిషాల నుంచి ఆగష్టు 7 మధ్యాహ్నం 1:15 నిమిషాల వరకు SBIకి సంబంధించిన ఆన్‌లైన్ సేవలకు అంతరాయం కలుగుతుందని పేర్కొంది. SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో పాటు యోనో మొబైల్ అప్లికేషన్ నిర్వహణ పనుల కారణంగా రెండు రోజుల పాటు ఆన్‌ లైన్‌ సేవలకు అంతరాయం కలుగుతుందని, ఈ అసౌకర్యంపై తాము చింతిస్తున్నామని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులు ఈ అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని తమ బ్యాంక్‌ లావాదేవీలను తాము సూచించిన సమయం కంటే ముందు లేదా తర్వాత పూర్తి చేయాలని అభ్యర్ధించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •