జాతీయం (National) వార్తలు (News)

ఒడుదొడుకుల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు!!

గత 3 రోజులుగా భారీ లాభాల్లో మునిగి తేలిన దేశీయ మార్కెట్లు గురువారం మాత్రం ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. ఈ ఉదయం సూచీలు లాభాలతో ప్రారంభమైనప్పటికీ కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 45 పాయింట్ల నష్టంతో 54,324 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 14 పాయింట్ల నష్టంతో 16,244 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

టెక్‌మహీంద్రా, ఐషర్‌ మోటార్స్‌, విప్రో, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఎస్‌బీఐ, టాటాస్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి. ప్రస్తుతం బ్యాకింగ్ నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతోంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •