అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

జర్మనీ రెండో ప్రపంచ యుద్ధంలో వాడిన ట్యాంక్‌ను దాచిపెట్టిన వ్యక్తి!!

హైకెన్‌డార్ఫ్‌లోని ఒక వృద్ధుని ఇంట్లో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి ట్యాంకుతో పాటు ఇతర యుద్ధ సామగ్రిని అధికారులు 2015లో గుర్తించారు. వాటిని అక్కడి నుంచి తరలించడానికి సైన్యం సహాయం తీసుకోవాల్సి వచ్చింది. 84 ఏళ్ల ఆ వృద్ధుడికి 14 నెలల జైలు శిక్షతో పాటు 250,000 యూరోల (దాదాపు 2.19 కోట్ల రూపాయలు) జరిమానా విధించారు.

జర్మనీ ప్రైవసీ చట్టాల ప్రకారం కోర్టు దోషి పేరు వెల్లడి చేయకూడదు. ఆ ట్యాంకును, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యానన్‌ను రెండేళ్లలోగా అమ్మడమో, మ్యూజియంకు విరాళంగా ఇవ్వడమో చేయాలని కోర్టు సోమవారం నాడు ఆదేశించింది. ఇక నిందితుడి తరఫు న్యాయవాది చెప్పిన ప్రకారం ఆ ‘పాంథర్ ట్యాంక్’ను కొనడానికి అమెరికాలోని ఒక మ్యూజియం ఆసక్తి చూపిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఉపయోగించిన ఆ ట్యాంక్ అత్యంత సమర్థమైనదని అమెరికా చరిత్రకారులు చెబుతున్నారు. ఆ ట్యాంకుతో పాటు పిస్టల్స్, రైఫిల్స్ కూడా తీసుకోవడానికి జర్మన్ సేకర్తలు కూడా ముందుకు వచ్చినట్లు సమాచారం!

ఆ వృద్ధుడి ఇంటి మీద గతంలో నాజీల కాలం నాటి కళారూపాల కోసం అధికారులు దాడి చేశారు. అక్కడ ఆయుధ సామగ్రి కూడా ఉందని సమాచారం అందడంతో స్థానిక అధికారులు 2015లో ఆ ఇంట్లో సోదాలు నిర్వహించి ఆ ఇంట్లోంచి పాంథర్ ట్యాంకును తరలించడానికి 20 మంది సైనికులు దాదాపు 9 గంటలు కష్టపడాల్సి వచ్చింది. ఆ వృద్ధుడు గతంలో ఒకసారి చలికాలంలో మంచును తొలగించేందుకు ఆ ట్యాంకర్ ఉపయోగిస్తూ కనిపించడంతో ఈ విషయం వెలుగు చూసినట్టు సమాచారం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    7
    Shares
  • 7
  •  
  •  
  •  
  •