అంతర్జాతీయం (International) జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

భారత్ ప్రయాణికులపై నిషేధం ఎత్తివేసిన యూఏఈ!!

భారత్‌ ప్రయాణికులపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేయనున్నట్టు యూఏఈ నేషనల్‌ ఎమర్జెన్సీ అండ్‌ క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ (NCEMA) తెలిపింది. ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ చెల్లుబాటయ్యే రెసిడెన్సీ వీసాలు, యూఏఈలో చెల్లుబాటయ్యే టీకా రెండు డోసులు తీసుకున్న వారికి నిషేధం నుంచి మినహాయింపును ఇవ్వడమే కాకుండా ఆ దేశంలో పని చేసే వైద్యులు, సాంకేతిక నిపుణులు, యూనివర్సిటీలు, కాలేజీలు, పాఠశాలలు, ఇన్‌స్టిట్యూట్లలో బోధించే వారికి షరతులు లేకుండా ఆ దేశంలో ప్రవేశానికి అనుమతి ఇచ్చింది. కానీ ప్రయాణానికి ముందు ఆన్‌లైన్ ఎంట్రీ పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండడమే కాకుండా ప్రయాణానికి 48 గంటల ముందు తీసుకున్న కొవిడ్‌-19 నెగెటివ్‌ ఆర్టీ పీసీఆర్‌ పరీక్ష సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •