క్రైమ్ (Crime) వార్తలు (News)

ఆర్యన్ ఖాన్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!!

డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కైన బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తోంది. ఎన్సీబీ(నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) మరోసారి కోర్టును ఆర్యన్ ఖాన్ కస్టడీ కోసం అడగనుంది. కస్టడీలో లోతుగా విచారిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని, రైడ్ లో లభించిన డ్రగ్స్ గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని ఎన్సీబీ అధికారులు అంటున్నారు. ఈ కేసుతో సంబంధం ఉందని అనుమానిస్తున్న శ్రేయస్ నాయర్ అనే వ్యక్తిని ఎన్సీబీ అదుపులోకి తీసుకుంది. ఆర్యన్ ఖాన్, అర్బాజ్ లకు డ్రగ్స్ సప్లయ్ చేసింది శ్రేయస్ నాయర్ అని ఎన్సీబీ గుర్తించింది.

వారి మధ్య జరిగిన చాటింగ్ ఆధారంగా శ్రేయస్ నాయర్ పాత్ర వెలుగులోకి వచ్చింది. ఈ ముగ్గురికి పార్టీల్లో పరిచయం ఏర్పడిందని, ఈ ముగ్గూరు కలిసి గతంలో అనేక పార్టీలు చేసుకున్నారని ఎన్సీబీ దర్యాఫ్తులో తేలింది. మరోవైపు క్రూయిజ్ షిప్ లో ఎన్సీబీ అధికారులు మరోసారి సోదాలు నిర్వహించగా మళ్లీ డ్రగ్స్ లభ్యమయ్యాయి. మరో 8మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆర్యన్ ను ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్న ఎన్సీబీ ఆర్యన్ డ్రగ్స్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నాడు? ఎవరు సరఫరా చేస్తున్నారు అనే విషయాలపై పూర్తిగా దృష్టి పెట్టి కొంత సమాచారం తెలుసుకుంది.

విచారణ సమయంలో నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఆర్యన్ ఎన్సీబీకి చెప్పినట్లు, యూకే, దుబాయ్ సహా ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ తీసుకునే వాడని ఎన్సీబీ అధికారులు చెబుతున్నారు. ఎన్సీబీ విచారణ సమయంలో ఆర్యన్ ఖాన్ ఏడుస్తూనే ఉన్నాడని అధికారులు చెబుతున్నారు. వైద్య పరీక్షల కోసం ఆర్యన్ ను ఆసుపత్రికి తరలించిన అధికారులు అక్కడి నుంచి మళ్లీ ఎన్సీబీ కార్యాలయానికి తీసుకొచ్చారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •