వార్తలు (News)

11 రోజుల తర్వాత నాలాలో దొరికిన మృతదేహం!!

గత నెల 25న మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌ నాలాలో గల్లంతైన మోహన్‌రెడ్డి కోసం అప్పట్నుంచి సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా 11 రోజుల తర్వాత ఐడీపీఎల్ కాలనీ వద్ద నాలలో మృతదేహం దొరికింది. మట్టిలో మృతదేహం కూరుకుపోయి ఉండడంతో శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

గణేశ్‌ టవర్స్‌లో నివాసముండే మెహన్‌రెడ్డి గత నెల 25న స్నేహితులతో కలిసి వైన్స్ వద్ద మద్యం సేవించి అనంతరం ఇంటికి బయల్దేరారు. భారీ వర్షం రావడంతో రోడ్డు పక్కన ఆగారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న నాలాలో పడిపోయి గల్లంతయ్యాడు. రెండు రోజుల తర్వాత ఆయన నాలాలో పడినట్లు సీసీ ఫుటెజ్ ద్వారా గుర్తించారు.

అప్పటి నుంచి జీహెచ్​ఎంసీ, డీఆర్​ఎఫ్​ బృందాలు, పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చేపట్టగా ఈ రోజు ఐడీపీఎల్ కాలనీ వద్ద నాలాలో కుళ్లినస్థితిలో మృతదేహం లభ్యమైంది. మృతదేహం నాలాలోని మట్టిలో కూరుకుపోయి ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. మృతుడి కుటుంబసభ్యులను పిలిపించగా అది మోహన్ రెడ్డి శవంగా నిర్ధరించారు. మోహన్ రెడ్డి నాలాలో పడ్డారు. కానీ ఎవరు గుర్తించలేదు. వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా సీసీ ఫుటెజ్ పరిశీలిస్తే అతడు నాలాల పడినట్లు గుర్తించి అప్పటి నుంచి గాలిస్తుండగా ఇవాళ మృతదేహం లభ్యమైంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •