అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) జాతీయం (National) వార్తలు (News)

హ్యాండ్ బ్యాగ్‌, లో దుస్తుల్లో బంగారం!!

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న కిలోకుపైగా బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలో సూడాన్‌ నుంచి దుబాయ్‌ మీదుగా హైదారబాద్‌ వచ్చిన మహిళను కస్టమ్స్‌ అధికారులు అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. ఆమె లగేజీ, హ్యాండ్‌ బ్యాగ్‌ సహా పూర్తిగా తనిఖీ చేయగా లో దుస్తులు, హ్యాండ్‌ బ్యాగ్‌లో నల్లటి ఉండల్లో బంగారాన్ని దాచుకొని తీసుకొచ్చినట్లు కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. దాదాపు 1.209 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు.. దాని విలువ రూ.58.16 లక్షలు ఉంటుందని తెలిపారు. మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శంషాబాద్‌ విమానాశ్రయం కస్టమ్స్‌ డిప్యూటీ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    3
    Shares
  • 3
  •  
  •  
  •  
  •