వార్తలు (News)

రాటాబరి లో వంతెన కూలి 30మంది విద్యార్థులకు గాయాలు!!

అసోంలోని కరీంగంజ్‌ జిల్లాలో నదిపై వేలాడే వంతెన కూలిపోవడంతో 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. రాటాబరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చెరాగి ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చెరాగి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే సింగ్లా నదిపై ఉన్న ఈ వేలాడుతున్న వంతెనను దాటాల్సి ఉంటుంది. ఈ నది చెరాగి ప్రాంతాన్ని అక్కడి గ్రామంతో కలుపుతుంది. అయితే, కొన్నేళ్లుగా విద్యార్థులు, ప్రజలు పాఠశాలలకు ఇతర ప్రాంతాలకు ఇదే వంతెన నుంచి వెళ్తున్నారు.

ఈ క్రమంలో సోమవారం చెరాగి విద్యాపీఠ్‌ హైస్కూల్‌ విద్యార్థులు ఇంటికి వెళ్లేందుకు సింగ్లా నదిని దాటేందుకు ప్రయత్నించగా అది అకస్మాత్తుగా కూలిపోవడంతో అనేకమంది విద్యార్థులు నదిలో పడిపోయినట్టు సమాచారం. సమాచారం అందుకున్న స్థానికులు అక్కడికి చేరుకొని విద్యార్థులను కాపాడారు. ఈ ఘటనలో దాదాపు 30మంది విద్యార్థులు గాయపడడంతో వారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ వేలాడే వంతెనను మూడేళ్ల క్రితమే నిర్మించినట్టు గ్రామస్థులు తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    13
    Shares
  • 13
  •  
  •  
  •  
  •