వార్తలు (News) వినోదం

మల్లెలతీర్థం జలపాతం పరవళ్లు!!

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని నల్లమల అడవి ప్రకృతి అందాలకు నెలవు! ఈమధ్యలో కురిసిన వర్షాలకు అమ్రాబాద్‌ మండలంలోని మల్లెలతీర్థం వద్ద జలపాతం పరవళ్లు తొక్కుతూ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆదివారం సెలవు కావటంతో హైదరాబాద్‌ వంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా జనం తరలివచ్చారు. 300 అడుగుల ఎత్తయిన కొండల నుంచి జాలువారుతున్న నీటి కింద పర్యాటకులు తడిసి ముద్దై పరవశించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •