రాజకీయం (Politics) వార్తలు (News)

పాతబస్తీకి మెట్రో : కేటీఆర్‌??

నగరంలోని పాతబస్తీకి ఏడేళ్లలో వివిధ శాఖల ద్వారా రూ.14,897 కోట్లు ఖర్చు చేశామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. 2004-14 మధ్య కాంగ్రెస్‌ రూ.3,934 కోట్లే ఖర్చు చేసిందని పేర్కొన్నారు. శాసనసభలో పలువురు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇస్తూ ‘‘పాతబస్తీలో పెద్ద ఎత్తున రోడ్ల అభివృద్ధి జరుగుతోంది. అక్కడ కచ్చితంగా మెట్రో రైలు వస్తుంది. కరోనా వల్ల పాతబస్తీకి మెట్రో రైలు కొంత ఆలస్యమైంది. ఎంఎంటీఎస్‌ రెండో దశ పనుల కోసం నిధులిస్తాం. చార్మినార్‌ పాదచారుల ప్రాజెక్టుకు మరో రూ. వంద కోట్లైనా ఇస్తాం. సెవెన్‌ టూంబ్స్‌, గోల్కొండకు ప్రపంచ వారసత్వ హోదా తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. మీర్‌ఆలం చెరువును దుర్గం చెరువులా అభివృద్ధి చేస్తాం. సచివాలయంలో మసీదు, గుడి, చర్చికి ఒకేసారి శంకుస్థాపన చేసి నిర్మాణాలు చేపడతాం’’ అని తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •