దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 12,26,064 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 8,895 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 2796 మరణాలు నమోదవ్వడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 4,73,326కి చేరాయి. గత 24 గంటల్లో 6918 మంది కరోనాను జయించగా ఇప్పటివరకు కరోనా నుండి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 34 కోట్లు దాటి, ఆ రేటు 98.35 శాతానికి చేరింది. దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 99,155గా ఉంది.