ఒక ఇల్లు కట్టాలంటే లక్షల్లో ఖర్చు చేయవలసిన ఈరోజుల్లో ఒక జంట రూ.2 కోట్ల విలువ చేసే తమ ఇల్లుని కేవలం వంద రూపాయలకే అమ్మేస్తున్నారు. మొన్నటి వరకు కేజీ టమోటాలు కూడా రూ.100 కి రాలేదు. అలాంటిది కోట్ల విలువ చేసే ఇల్లు కేవలం వంద రూపాయలకే ఎందుకు అమ్ముతున్నారో తెలుసుకుందామా..

ఇంగ్లాండ్ లో సౌత్ టెన్ సైడ్ అనే ప్రాంతంలో అక్కడ ఒక కుటుంబం అన్ని సౌకర్యాలతో రెండు ఫోర్ల బిల్డింగ్ కట్టుకుంది. దానిలో మూడు బెడ్ రూమ్స్, ఒక గార్డెన్, పార్కింగ్ అంతా ప్లాన్ చేసి కట్టుకున్నారు.ఆ ఇల్లు బీచ్ కి కూడా అతి దగ్గరలో ఉంది. కిటికీ తెరిచి చూస్తే.. సముద్రం, అలలు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఆడమ్ థ్వైటస్, లిజ్ అనే జంట ఈ ఇల్లు కట్టుకున్నారు. అయితే.. వాళ్లిప్పుడు వేరే ప్రాంతానికి వెళ్లి సెటిల్ అవుదామనుకుంటున్నారు. అయితే వాళ్లు చారిటీ పనులు చేస్తూ ఉంటారు. ఆ పనుల కోసం మరియు వారి కూతురు చదువు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ ఇల్లును అమ్మేద్దామనుకుంటున్నారు. గ్రేస్ హౌజ్ అనే చారిటీ కోసం పని చేసే లిజ్.. అంగవైకల్యం పిల్లలు ఆడుకోవడానికి ఓ గార్డెన్ ఏరియా ఏర్పాటు చేయాలనుకుంటుంది. అందుకు రూ.13 లక్షలు ఖర్చవుతాయి. అంత డబ్బు తన దగ్గర లేకపోవడంతో ఇల్లు అమ్మేద్దామనుకున్నారు. దీనికి తోడు వాళ్లు కూడా ఆ ప్రాంతాన్ని వదిలి వేరే ఏరియాకు షిఫ్ట్ అవుదామనుకుంటున్నారు. దీంతోనే రెండు కోట్ల రూపాయలు విలువ చేసే ఇంటికి జస్ట్ రూ.100 కే అమ్మకానికి పెట్టారు. అయితే ఇక్కడొక చిన్న విషయం ఉంది. అదేంటంటే…

ఇల్లు డైరెక్ట్ పద్ధతిలో కాకుండా లాటరీ సిస్టమ్ ద్వారా అమ్మాలనుకుంటున్నారు. రూ.2 కోట్ల రూపాయల ఇంటిని అమ్మేందుకు 2 లక్షల లాటరీ టికెట్లు సమకూర్చారు. వాటిని ఒక్కొక్కటి రూ100 రూపాయలకు అమ్ముతున్నారు. 100 రూపాయలు పెట్టి టికెట్ కొంటే .. డ్రా తీసి అందులో గెలిచిన వారికి ఆ ఇల్లు ఇచ్చేస్తారు. ఈ ఏడాది క్రిస్ట్ మస్ నాడు లాటరీ డ్రా తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాను పనిచేస్తున్న చారిటీ కోసం లిజా ఫండ్ రైజింగ్ చేస్తోంది. చారిటీ కోసం 50 లక్షలను సేకరించడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇప్పటికే కొన్ని టికెట్లు అమ్ముడుపోయాయట. క్రిస్‌మస్ వరకు 2 లక్షల టికెట్లు అమ్ముడుపోతే.. క్రిస్‌మస్ రోజే బంపర్ డ్రా తీసి.. లక్కీ విన్నర్‌కు తమ ఇంటి తాళాలను అందించాలని ఈ కుటుంబం ఏర్పాట్లు చేసుకుంటుంది.