వాతావరణ మార్పులు సంభవించిన ప్రతిసారి దగ్గు,జలుబు,గొంతునొప్పి బాధిస్తూ ఉంటాయి. రావడం త్వరగానే వచ్చేస్తాయి కానీ తగ్గాలంటే చాలా సమయం పడుతుంది.
అందుకే దగ్గు ప్రారంభ దశలో ఉన్నప్పుడు మందులు వాడవలసిన అవసరం లేకుండా వంటింటి చిట్కాలతోనే దానిని పోగొట్టుకోవచ్చు. దగ్గు ఎక్కువగా ఉంటే మాత్రం మందులు వాడుతూ వంటింటి చిట్కా కూడా వాడడం వల్ల తొందరగా ఉపశమనం పొందవచ్చు.

ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి నీరు కాస్త వేడెక్కాక 10 నుంచి 15 పుదీనా ఆకులను వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. బాగా మరిగిన ఈ నీటిని గ్లాస్ లోకి వడకట్టి అరచెక్క నిమ్మరసం, అరస్పూన్ తేనె కలిపి తాగాలి. రోజుకి రెండుసార్లు ఈ ద్రావణం తీసుకోవాలి.