హైదరాబాద్‌ కు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం రావడం సంతోషమని, ప్రభుత్వమూ మరియు ప్రజల తరపున సీజేఐ ఎన్వీ రమణకు ఆయన ధన్యవాదాలు అని సీఎం కేసీఆర్‌ అన్నారు. మధ్యవర్తిత్వం అనేది దేశంలో రచ్చబండ వంటి రూపాల్లో ఎప్పటి నుంచో అమలులో ఉందని, ఏఐఎంసీ కోసం 25వేల చదరపు అడుగులు కేటాయించామని, శాశ్వత భవనం కోసం పుప్పాలగూడలో భూమి కేటాయిస్తామని కేసీఆర్‌ చెప్పారు.