కేంద్ర ప్రభుత్వం కర్నూలుకు చెందిన షేక్‌ జఫ్రిన్‌కు 2020 సంవత్సరానికి ఉత్తమ క్రీడాకారిణి అవార్డు ప్రకటించింది. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం దిల్లీ లో ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు.