నేషనల్‌ హౌజింగ్‌ బ్యాంక్‌ సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతల వివరాలు చూడండి..

డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఏదైన విభాగంలో 60 శాతం మార్కులతో డిగ్రీ లేదా 55 శాతం మార్కులతో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు. అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు, అలాగే డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు 32 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు : ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 200 మార్కులకు గాను ఆబ్జెక్టివ్‌, 30 మార్కులకు డిస్క్రిప్షన్‌ ప్రశ్నలు ఉంటాయి. ఎంపికై అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 60 వేల నుంచి రూ. 1,26,954 వరకు పొందే అవకాశం ఉంది. దరఖాస్తుల స్వీకరణకు 30-12-2021 ని చివరి తేదీగా నిర్ణయించారు.