భారతీయ రైల్వేను ప్రైవేటీకరణ చేయనున్నారని ఇప్పటికే వస్తున్నా వార్తలపై కేంద్ర రైల్వేశాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందిస్తూ ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. భారత ఐకానిక్ అయిన రైల్వేలను ప్రైవేటీకరణ చేయనున్నామని లేదా విక్రయిస్తున్నామని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, భవిష్యత్‌లోనూ అలాంటి నిర్ణయం ఉండదని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైల్వే అనేది క్లిష్టమైన వ్యవస్థ అని, రైల్వేలను ప్రైవేటీకరించే విషయంపై కేంద్రం ఎలాంటి చర్చలు జరపడంలేదని ఆయన పేర్కొన్నారు.