ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 33,339 పరీక్షలు నిర్వహిస్తే 547 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,78,923కి చేరింది. నిన్న కరోనాతో ఒకరు మరణించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 14,500కి చేరింది. గత 24 గంటల్లో 128 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 20,62,157 కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,266 యాక్టివ్‌ కేసులున్నాయి.