దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 14,13,030 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 90,928 కొత్త కేసులు నమోదవడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.51 కోట్లకు చేరింది. నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 325 మరణాలు సంభవించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4,82,876 కు చేరింది. గత 24 గంటల్లో 19,206 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3.43 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో 2,85,401 క్రియాశీల కేసులు నమోదయ్యాయి.

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2,630కి చేరింది. నిన్న కొత్తగా 495 మంది దీని బారినపడ్డారు. మహారాష్ట్రలో అత్యధికంగా 797 మందికి ఒమిక్రాన్ వేరియంట్‌ సోకగా దిల్లీలో ఆ సంఖ్య 465కి పెరిగింది. నిన్నటికి ఓమిక్రాన్ నుండి మొత్తం 995 మంది కోలుకున్నారు.

ఓమిక్రాన్ కేసుల వివరాలు..