దేశీయ మార్కెట్ సూచీలు నేడు భారీ నష్టాల మధ్య ముగిసాయి.ఉదయం సెన్సెక్స్‌ 59,731.75 పాయింట్ల వద్ద మొదలై రోజంతా నష్టాల్లోనే పయనించి ఒక దశలో 59,290.58 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయి చివరకు 621 పాయింట్లు దిగజారి 59,601.84 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 17,768.50 పాయింట్ల వద్ద మొదలై 17,655.55 కనిష్ఠ స్థాయిని తాకి చివరకు 179 పాయింట్లు నష్టపోయి 17,745.90 వద్ద ముగిసింది.

ఎన్‌ఎస్‌ఈలో భారతి ఎయిర్‌టెల్‌, యూపీఎల్‌ లిమిటెడ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, టెక్‌ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, శ్రీ సిమెంట్స్ షేర్లు నష్టపోయాయి.