దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు నేడు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.23 గంటల సమయంలో సెన్సెక్స్‌ 495 పాయింట్ల నష్టంతో 59,734 ట్రేడవుతుండగా, నిఫ్టీ 144 పాయింట్ల నష్టంతో 17,781 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌లోని ఒమెక్స్‌ లిమిటెడ్‌, ఫ్యూచర్‌ రిటైల్‌, ఫ్యూచర్‌ కన్జ్యూమర్‌, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌, రానే హోల్డింగ్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. స్పందనా స్ఫూర్తి ఫినాన్స్‌, సుజ్లన్‌ ఎనర్జీ, ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, అరుణ్‌ ప్రాప్‌టెక్‌ సంస్థల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.