ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు, పథకాలను మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ సర్కార్ వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చింది. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందడంతో పాటు అనేక మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ క్రమంలో తాజాగా అధికారులు మరో 279 వాలంటీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో గుంటూరు జిల్లాలో 222, చిత్తూరు జిల్లాలో 57 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఖాళీల వివరాలు:

గుంటూరు జిల్లాలో మొత్తం 222 ఖాళీలు ఉన్నాయి. ఇందులో సత్తెనపల్లిలో 7, పిడుగురాళ్లలో 9, మంగళగిరిలో 9, చిలకలూరిపేటలో 14, తెనాలిలో 13, దాచేపల్లిలో 2, వినుకొండలో 4, నరసరావుపేటలో 6, గురజాలలో 3, బాపట్లలో 2, పొన్నూరులో 3, మాచర్లలో 4, గుంటూరు మున్సిపాలిటీలో 146 వాలంటీర్ పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 9లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

చిత్తూరు జిల్లాలో మొత్తం 57 ఖాళీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో నగరిలో 2, పుత్తూరులో 3, చిత్తూరు మున్సిపాలిటీలో 22, తిరుపతిలో 10, పుంగనూరులో 11, శ్రీకాళహస్తిలో 5, మదనపల్లిలో 3, పలమనేరులో 1 ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 6లోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

అర్హతలు

పదో తరగతి పాసై, ప్రభుత్వ పథకాల మీద పూర్తి అవగాహన ఉన్న వారు దరఖాస్తుకు అర్హులు. పథకాలను ప్రజలకు వివరించగలగాలి. తెలుగు రాయడం, చదవడం వచ్చి ఉండాలి.

ఎలా అప్లై చేయాలంటే

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. వెబ్ సైట్ ఓపెన్ చేసి వివరాలన్నీ నమోదు చేయాలి. పదో తరగతి సర్టిఫికెట్ ను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. సంతకం చేసిన ఫొటోను కూడా జత చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేసిన అనంతరం రిజిస్ట్రేషన్ ఐడీ వస్తుంది. ఈ ఐడీ, ఆధార్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ తదితర వివరాలను నమోదు చేసి ఇంటర్వ్యూ తేదీ తదితర వివరాలను తెలుసుకోవచ్చు.