అంతర్జాతీయం (International)

రెండు విప‌త్తుల‌తో ‌ప‌దేళ్ల‌లో కోటి మంది మ‌రణిస్తారు: బిల్ గేట్స్

క‌రోనా వైర‌స్ లాంటిది ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తుంద‌ని ముందే అంచ‌నా వేసిన మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ద‌శాబ్ధ కాలంలో ప‌లు విప‌త్తులు సంభ‌విస్తాయని, వాటి వ‌ల్ల దాదాపు కోటి మంది ప్ర‌జ‌లు మ‌ర‌ణి‌స్తార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ విప‌త్తులు కూడా వైర‌స్‌లేన‌ని ఆయ‌న అంచ‌నా వేశారు. ఇక నుంచి ప్ర‌త్య‌క్ష యుద్ధాల కంటే బ‌యో వార్‌ల వ‌ల్ల‌నే ప్ర‌మాద‌మ‌ని ఆయ‌న తెలిపారు.

వెరిటాసియం అనే ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌తో మాట్లాడిన బిల్ గేట్స్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వాతావ‌ర‌ణ మార్పులు, బ‌యో వార్‌లు భ‌విష్య‌త్‌లో ఈ ప్ర‌పంచానికి ప్ర‌మాద‌క‌రంగా మార‌తాయ‌ని అన్నారు. ఇక మ‌నుషుల‌ను యుద్ధాలు, మిస్సైల్స్ చంప‌వ‌ని, వైర‌స్‌లే మ‌నుషుల ప్రాణాలు తీస్తాయ‌ని ఆయ‌న అంచ‌నా వేశారు. బ‌యో వార్‌లు ప్ర‌పంచానికి తీర‌ని న‌ష్టం చేస్తాయ‌ని పేర్కొన్నారు.

వాతావ‌ర‌ణ మార్పులు కూడా ప్ర‌మాద‌క‌రంగా మార‌తాయ‌న్నారు. వ‌చ్చే ప‌దేళ్ల‌లోనే వాతావ‌ర‌ణ మార్పులు, బ‌యో వార్‌ల వ‌ల్ల కోటి మంది ప్రాణాలు కోల్పోయే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. కాగా, క‌రోనాను కూడా బిల్ గేట్స్ ముందే అంచ‌నా వేశార‌నే ప్ర‌చారం ఉంది. స‌మీప భ‌విష్య‌త్‌లో ఓ వైర‌స్ ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేయ‌బోతోంద‌ని ఆయ‌న 2015లోనే చెప్ప‌డం, క‌రోనా రూపంలో అది నిజం కావ‌డం తెలిసిందే.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.