ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు,రిటర్నింగ్ అధికారులు అభద్రతకు లోను కావద్దు…

ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఎన్నికల కమిషన్ రక్షణ కవచంలో ఉంటారు..

ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటీ ఈసీ అనుమతి తప్పనిసరని గతంలో కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది..

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తుంది..

బెదిరింపులకు గురిచేసేలా ఎంతటి పెద్దవారు ప్రకటన చేసినా అధికారులు భయబ్రాంతులకు గురికావద్దు

ప్రభుత్వ ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు అనైతికం

ఉద్యోగుల పట్ల దుందుడుకు చర్యలకు పాల్పడే వారిని ఏ మాత్రం ఉపేక్షించే ప్రసక్తి లేదు

వ్యక్తులు ఎవరైనా తాత్కాలికమే…వ్యవస్థలు మాత్రమే శాశ్వతం