బంగ్లాదేశ్ జాతీయులకు భారత పాస్‌పోర్టులు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చి కలకలంరేపుతోంది. ఈ పాస్‌పోర్టుల జారీ వెనక నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీసుల పాత్ర ఉన్నట్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. విమానాశ్రయ పోలీసులు వారిని విచారణ కోసం తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. బంగ్లాదేశీయులకు నిజామాబాద్ నుంచి భారత పాస్‌పోర్టులు జారీ అయిన విషయాన్ని గుర్తించిన శంషాబాద్ విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేశారు.