భారతీయ జనతా పార్టీ చింతలపూడి మండల అధ్యక్షుడు మొగిలి దుర్గ మణికుమార్  ఆద్వర్యంలో  చింతలపూడి గ్రామంలో బి.ఆర్ .అంబేత్కర్ విగ్రహానికి జరిగిన సంఘటనకు  భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. రాఘవులు తీవ్ర నిరసన వ్యక్తం చేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రత్న, ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాతని ఈ విధంగా అవమాన పరచటం చాలా నీచమైన, పిరికి బంధ చర్య  అని అన్నారు. పోలీసులు దొంగ దొరికాడని అతను తమకి రిజర్వేషన్స్ లేవని అందుకే ఇలా చేశానని తెలుపుతున్నారు. కానీ పోలీసులు ఇంతతో ఆగకుండా అసలు దీని వెనుక వున్నా అసలు దొంగలు పట్టు కోవాలని   రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిట్టింగ్ జడ్జితో నిష్పక్ష పాతం గా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలా చేయాలని పక్షం లో బీజీపీ రాష్ట్ర యాప్తంగా ఆందోళను చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఆయన విగ్రహానికి పాలతో అభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చింతలపూడి బిజెపి సీనియర్ నాయకులు తమ్మారెడ్డి, చింతలపూడి నియోజక వర్గ ఇంచార్జి సిహెచ్. విక్రమ్ కిషోర్, బిజెపి ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, రాష్ట్రా కిస్సాన్ మోర్చా కార్యదర్శి యుగంధర్, ఏలూరు యస్.సి. మోర్చా అధ్యక్షుడు శీనివాస శాస్త్రి, చింతలపూడి నియోజకవర్గ ఎలక్షన్ ఇంచార్జి చక్రధర్, ఏలూరు జిల్లా ఓబిసి మోర్చా అధ్యక్షుడు సతీష్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ టి.వి.నారాయణ, మండల ప్రధాన కార్యదర్శి వరప్రసాద్, మండల ఉపాధ్యక్షుడు మోహనరావు, యమ.యస్.ఆర్.  కార్యకర్తలు పాల్గొన్నారు.