పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ షూటింగ్ జెట్ స్పీడ్‌తో జరుగుతోంది. అలానే ఈ సినిమా గురించి ఇన్‌ట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా బయటకు వస్తున్నాయి. ఈ సినిమాలో ముగ్గురు దర్శకులు ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ముగ్గురిలో ఒకరు సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, మరొకరు డైలాగ్స్ రాస్తున్నారు. మరో దర్శకులు ఈ సినిమాలో నటిస్తున్నాడు.
అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్‌ను సాగర్ చంద్ర అనే డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, పవన్ కళ్యాణ్ సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే చూసుకుంటున్నారు. ఇప్పుడు మరో దర్శకుడు వి.వి.వినాయక్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. సినిమాలో ఒక చిన్న రోల్లో వినాయక్ నటిస్తున్నాడు. చిన్నదైనా, కీలకమైన పాత్ర కాబట్టి అందరికీ తెలిసిన నటుడిని పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు వినాయక్‌ను ఎంపిక చేశారు.
పవన్ కళ్యాణ్ కూడా ఓకే అనడంతో వినాయక్ షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. గతంలోనూ వినాయక్ తనే డైరెక్ట్ చేసిన ఠాగూర్ సినిమాలో నటించాడు. హీరోగా శీనయ్య అనే మరో సినిమాను ప్రకటించినా ఆ సినిమా ఆగిపోయింది.