ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనా కేసులకు సంబంధించి బులెటిన్‌ విడుదల చేసింది. డిచిన 24 గంటల్లో 46,566 కరోనా పరీక్షలు నిర్వహిస్తే, 115 కేసులు పా జిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో చిత్తూరులో ఒకరు ప్రాణాలు కోల్పోగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7,173కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 93 మంది పూర్తిగా కోలుకుంటే. ఇప్పటికి రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,82,462కి చేరింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,90,556కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 921 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటికి రాష్ట్రంలో 1,41,90,477 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.