తెలంగాణలో నిన్న కొత్తగా 170 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న రాత్రి 8గంటల వరకు 40,712 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, నమోదైన కేసుల సంఖ్య 2,99,742కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం ‌ విడుదల చేసిన బులిటెన్ లో ఈ వివరాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఒకరు మరణించారు. మొత్తం ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1640కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 196 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,96,166కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,936 క్రియాశీలక కేసులు ఉన్నాయని, వారిలో 812 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. హెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 28 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అవ్వగా తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 89,24,007కి చేరింది.