రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో అంబమాత పోలీసుస్టేషన్‌ పరిధిలో ఉన్న ప్రభుత్వ అంధ విద్యాలయంలోని ఓ ఉపాధ్యాయురాలికి ఇటీవల కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో విద్యార్థులందరికీ పాఠశాల యాజమాన్యం కొవిడ్‌ పరీక్షలు చేయించగా 28 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు తేలింది. అంధుల హాస్టల్‌లో 28 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. స్థానికంగా ఈ విషయం కలకలం సృష్టించడంతో జిల్లా కలెక్టర్‌ చేతన్‌ దేవరాజ్‌, ఎస్పీ హాస్టల్‌కు వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. వైరస్‌ సోకిన విద్యార్థులను ప్రత్యేక భవనంలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. నెగెటివ్‌ వచ్చిన విద్యార్థులను మరో చోట ఉంచిన అధికారులు ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. ఆ ఏరియా ను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు.