చివరి టెస్టులో విజయంతో భారత్ 3-1తో సొంతం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌట్ అయిన భారత్ 160 పరుగుల ఆధిక్యం సాధించింది. భారత్ ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

వాషింగ్టన్ సుందర్ 96 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, అశ్విన్ 13, అక్షర్ పటేల్ 43 పరుగులు చేశారు. ఇషాంత్ శర్మ, మహమ్మద్ సిరాజ్ పరుగులేమీ చేయకుండానే అవుట్ అయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 4, జేమ్స్ అండర్సన్‌ 3, జాక్ లీచ్ 2 వికెట్లు పడగొట్టారు. దాని తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్, 135 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

ఇంగ్లండ్ జట్టులో డేనియల్ లారెన్స్ (50), జో రూట్ (30) టాప్ స్కోరర్లుగా నిలవగా, అక్షర్ పటేల్, అశ్విన్ చెరి ఐదు వికెట్లు పడగొట్టారు. 3-1తో సిరీస్ గెలుచుకున్న భారత్ ఐసీసీ టెస్ట్ ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించి, ఈ జాబితాలో 520 పాయింట్లతో భారత్ టాప్‌లో నిలిచింది. మొత్తం ఆరు సిరీస్‌లలో 12 మ్యాచ్‌లు గెలిచిన భారత్ 4 మ్యాచ్‌లు కోల్పోయి, 1 డ్రా చేసింది.